‘దిల్‌రాజు’ సినిమాలో.. జాతీయ అవార్డు నటుడు!

‘దిల్‌రాజు’ సినిమాలో.. జాతీయ అవార్డు నటుడు!

Published on Mar 26, 2015 11:28 PM IST

Dil-Raju
గత కొంతకాలంగా తెలుగులో సినిమాలేవీ చేయని సిద్ధార్థ, తమిళంలో మాత్రం వరుస సినిమాలతో మంచి జోరు మీదున్నాడు. 2014లో సిద్దార్థ్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం.. ‘జిగర్‌తండా’. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత సంవత్సరం ఆగష్టు ఒకటిన విడుదలైంది. ఇక తమిళంలో విడుదలైన రోజునుంచే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు కానీ అది కుదర్లేదు. చివరకు ఇప్పటికి ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యేందుకు అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ‘దిల్‌రాజు’ పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.

ఈ సినిమాకి కథ, మేకింగ్ స్టైల్‌, సిద్దార్థ్‌ల నటన ఒక ఎత్తైతే.. సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ సింహ నటన మరో ఎత్తు. ఇదే సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా బాబీ సింహ జాతీయ అవార్డును కూడా అందుకోవడం విశేషం. తమిళంలో ఈ సినిమాని చూడని వారికి ఇప్పుడు తెలుగులో చూసే అవకాశం వచ్చింది. జాతీయ అవార్డు నటుడి నటనను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులూ చూడొచ్చు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బాబీ సింహ పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు