దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.
అయితే యాత్ర ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ”యాత్ర’ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే.. యూఎస్ తో సహా అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ డ్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. బుకింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. యాత్ర మంచి ఓపెనింగ్స్ తో మొదలవ్వబోతుంది. ఇక ఈ సినిమాను నైజాంలో అలాగే వైజాగ్ లో కూడా మా సంస్థనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇక ఈ యాత్ర సినిమా చాలా పెద్ద స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని దిల్ రాజు తెలిపారు.
ఇక ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.


