వెంకీతో ఆ హిట్ దర్శకుడి మూవీ ఏమైంది?

Published on Jul 30, 2019 1:03 pm IST

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక్క సినిమాతో ఎవరు ఊహించని రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ ,రీతూ వర్మ జంటగా ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా “పెళ్లి చూపులు” చిత్రం ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రసంశలు అందుకోవడంతో పాటు, కమర్షియల్ గా కూడా రికార్డు వసూళ్లు సాధించింది. రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం జరిగింది. హిందీ,మలయాళ భాషలలో రీమేక్ కూడా అయ్యింది.

2016 జులై 29న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నిన్నటికి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఆ స్థాయి అవకాశాలతో దూసుకెళ్లడం లేదు. గత సంవత్సరం ఆయన “ఈ నగరానికి ఏమైంది?” అనే ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కంటెంట్ పరంగా ఒకే అనిపించినా కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా తరుణ్ విశ్వక్సేన్ నటించిన “ఫలక్ నుమా దాస్” చిత్రంలో పోలీస్ గా నటించారు.

కొద్దిరోజుల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రానున్న ఓ చిత్రానికి తరుణ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ, అది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో స్పష్టత లేదు. ప్రస్తుతం వెంకటేష్, చైతూ తో కలిసి చేస్తున్న ” వెంకీ మామ” చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు.దీని తరువాత ఆయన అజయ్ దేవగణ్ సూపర్ హిట్ హిందీ చిత్రం “దే దే ప్యార్ దే” తెలుగు రీమేక్ లో నటించే అవకాశం కలదు.

మరి తరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేకా,ఆయన సొంతగా రాసుకున్న స్క్రిప్ట్ లో వెంకీ నటిస్తారా? అనేది తెలియాల్సివుంది. ఏదిఏమైనా “పెళ్లి చూపులు” లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తీసిన దర్శకుడుని నుండి మరో అద్భుత చిత్రం కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :