టీజర్ చూసి తీర్పు చెప్పేయండి అంటున్న మహేష్ డైరెక్టర్.

Published on Nov 22, 2019 7:08 am IST

ఈ రోజు మహేష్ ఫ్యాన్స్ కి బిగ్ డే. సూపర్ మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు టీజర్ నేడు విడుదల కానుంది. దీనితో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మూవీ టీజర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా డిస్ట్రిబ్యూటర్స్ కి ఓ సందేశం ఇచ్చారు. ఆయన వారిని టీజర్ చూడమని కోరడంతో పాటు, సినిమా రిజల్ట్ అంచనా వేయమంటున్నారు.

అన్నం ఉడికిందో లేదో చెప్పాడానికి ఒక మెతుకు చాలు, అలాగే సినిమా టీజర్ చూసి మూవీ ఫలితం చెప్పవచ్చు అని ఆయన వారికి సెలవిచ్చారు. ప్రత్యేకంగా దర్శకుడు అనిల్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఉద్దేశించి మాట్లాడిన తీరు చూస్తుంటే… టీజర్ చూసి మా సినిమాకు మంచి ధర పెట్టికొనండి అన్నట్టు ఉంది. ప్రస్తుతం ఈ మూవీ కేరళల లో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుందని సమాచారం. రశ్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు చేస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More