మహేష్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు…!

Published on Aug 3, 2019 11:15 am IST

దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరూ” గురించి ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.ఇటీవలే కాశ్మీర్ లో మొదటి షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. కాగా ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్ లో జరుగుతున్నసెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ రశ్మిక పాల్గొననుంది సమాచారం.

“శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో హిలేరియస్ గా సాగే ట్రైన్ జర్నీ వచ్చే సంక్రాంతి కి ధియేటర్లలో ఎదురుచూస్తుంది” అంటూ అని ఓ ట్వీట్ చేయడంతో పాటు, ఆ సెట్ లోని మహేష్ ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. దీనితో “సరిలేరు నీకెవ్వరూ” లో ఆ ట్రైన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అని అభిమానులలో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న తరుణంలో ఆయన బోర్డర్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో హీరోయిన్ రశ్మికకు, మహేష్ కి మధ్య రొమాంటిక్ కామెడీ ని దర్శకుడు అనిల్ ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ప్లాన్ చేసాడేమో అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :