ఎన్టీఆర్ తో మూవీ పై హింట్ ఇచ్చిన దర్శకుడు అట్లీ

Published on Oct 23, 2019 3:38 pm IST

మొదటి చిత్రం రాజా రాణి తో ఓ విభిన్నమైన ప్రేమకథను తెరకెక్కించి అందరినీ ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తలపతి విజయ్ తో తేరి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ విజయం తరువాత విజయ్ అట్లీతో మరో మూవీ మెర్సల్ చేయగా ఆ చిత్రం కూడా బంపర్ హిట్ సాధించింది. అదిరింది పేరుతో తెలుగులో విడువులైన ఈ చిత్రం మొదటిసారి విజయ్ కి తెలుగులో కూడా హిట్ అందించింది. ఈ హిట్ కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ బిగిల్ ఇంకా రెండు రోజులలో దీపావళి కానుకగా విడుదల కానుంది.

ఐతే ఈ టాలెంటెడ్ దర్శకుడు ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన విజిల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అట్లీ ఈ చిత్రంపై హింట్ ఇచ్చారు. ఆయన త్వరలోనే ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం కలదని చెప్పారు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటుంది అనే విషయం స్పష్టం ఐయ్యింది. స్టార్ హీరోలను ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చూపించడంలో దిట్టైన అట్లీ ఇక మాస్ కా బాప్ ఎన్టీఆర్ ని ఏరేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది జులై వరకు ఫ్రీ కాలేదు. మరి ఈలోపు అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే వీరిద్దరి మూవీ 2020 చివరికల్లా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More