మెగాస్టార్ గిఫ్ట్ తో ఎగ్జైట్ అవుతున్న స్టార్ డైరెక్టర్.!

Published on Aug 1, 2021 5:00 pm IST


తన మొదటి సినిమాతోనే దర్శకునిగా “పవర్” చూపించిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. ఆ తర్వాత కూడా వరుసగా స్టార్ హీరోస్ తోనే సాలిడ్ చిత్రాలు చేస్తూ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసే డైరెక్షన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే మరి ఈరోజు ఈ స్టార్ దర్శకుని బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా తన విషెష్ తెలుపుతుండగా మెగాస్టార్ తనకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ పై ఎగ్జైట్ అవుతూ ఓ బాబీ పోస్ట్ పెట్టారు.

“నా ఐడల్ మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులని ఈ పుట్టినరోజుకి అందుకోవడం మెమొరబుల్ గా ఉంది, కోట్లల్లో ఉన్న ఒక అభిమాని నుంచి మిమ్మల్ని డైరెక్ట్ చేసేంత వరకు రాగలిగాను ఇది నిజంగా ఒక అభిమానిగా డ్రీం లాంటిది అది ఇప్పుడు నిజం అయ్యింది ఈ బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ చెబుతున్నాను” అని బాబీ ఓ అభిమానిగా తన ఆనందం ఎగ్జైటెడ్ గా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :