బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

Published on Sep 20, 2025 8:00 AM IST

Itlu-Mee-Edhava

సంజీవని ప్రొడక్షన్స్‌పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా విడుదల చేశారు. త్రినాధ్ కఠారి హీరో, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ సాహితీ అవాంచ జోడి కడుతున్నారు. “వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లూ” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రావడం ప్రత్యేకత.

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ – “గ్లింప్స్ చాలా బావుంది, ఫన్‌గా ఉంది. టైటిల్ ప్రతి అబ్బాయికి సరిపోతుంది. ఇది మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అవుతుంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
ఈ సినిమాలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని R.P. పట్నాయక్ అందిస్తుండగా, నాలుగు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా, ఉద్ధవ్ SB ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఇట్లు మీ ఎదవా’టైటిల్ గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు