“ఆకాశ వీధుల్లో” ట్రైలర్ చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది – గోపీచంద్ మలినేని

Published on Jul 23, 2021 2:38 pm IST

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాల పై గౌతమ్ ఇను దర్శకుడు గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం ఆకాశ వీధుల్లో. ఈ చిత్రానికి మనోజ్ డీజే, మణికంఠ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకకు హాజరైన ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్రైలర్ విడుదల చేశారు.

అయితే ఈ నేపథ్యం లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, ఒకరోజు వీళ్ళు నాకు ఫోన్ చేసి ట్రైలర్ చూడమని చెప్పారు, నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు అని తెలిపారు. అయితే ట్రైలర్ చూశాక చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. కొత్త దర్శకుడు అయినా, మొదటి సినిమాకే ఇంత బాగా తీశాడు అంటే అతనిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. అయితే ట్రైలర్ ను చూశాక టీమ్ ను అభినందించాలనే వేడుకకు వచ్చినట్లు తెలిపారు. టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే దర్శకత్వం మాత్రమే కాదు హీరో గా కూడా చాలా ఇంటెన్స్ తో నటించాడు అని అన్నారు. తెలుగు అమ్మాయిలు తక్కువ అవుతున్న సమయం లో పూజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అని అన్నారు.కొత్త టీమ్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ, టీజర్ చాలా బావుంది, డైరెక్టర్ గౌతమ్ ను అభినందిస్తున్నాను అని అన్నారు.సినిమా విషయం లో అందరూ కొత్తవాళ్ళే నేనే సీనియర్ అని అనుకొనే దాన్ని, కానీ సినిమా షూటింగ్ లో గౌతమ్ టాలెంట్ చూసి షాక్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. మొదటి సినిమా కే హీరో, డైరెక్టర్ ఒక్కడే అయ్యి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం మామూలు విషయం కాదు అని, గౌతమ్ రెండు పనులు చక్కగా అదరగొట్టారు అని అన్నారు. జూడా శాండీ చక్కని సంగీతం అందించారు, పాటలు వింటే అదిరి పోతాయి, అలాగే నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు అని, ఈ చిత్రం అందరికీ మంచి పేరు తెస్తుందని తెలిపారు.

నిర్మాత మనోజ్ సైతం దర్శకులు, హీరోయిన్, టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట పై ప్రత్యేక ప్రశంసల వర్షం కురిపించారు. అదే విధంగా రాహుల్ రామకృష్ణ, చిన్మయి పాడిన పాటలు అదిరిపోతాయి అని అన్నారు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం ఉందని తెలిపారు.

అయితే హీరో, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, సాధారణం గా హీరో, దర్శకుడు ఒక్కటే అయితే ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరూ అంటారు, కానీ అది కాదు, సినిమాను నేనే దర్శకుడు అవ్వడానికి కారణం ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమం లో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి అని, కథలో ఎక్కడా కూడా ఇంటెన్షన్ తగ్గకూడదు అని తానే దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. సినిమా కోసం చాలా కష్టపడ్డాం అని, 160 పేజీల స్క్రిప్ట్ తానొక్కడే రాసుకున్నట్లు తెలిపారు. సినిమా అంటే ప్యాషన్ అని, ఎవరు హెల్ప్ తీసుకోకుండా, తానే దగ్గర ఉండి డైరెక్షన్ చేస్తున్నట్లు తెలిపారు.అయితే ఈ చిత్రం కసితో చేశాం అని, ఇందులో ఓ మర్డర్ చేసిన వ్యక్తినో, గ్యాంగ్ స్టర్ నో హీరో గా చూపించ లేదు అని, హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ అంటూ చెప్పుకొచ్చారు.అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం :