తన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు హరీష్ శంకర్ బర్త్ డే విషెస్!

Published on Mar 10, 2023 4:05 pm IST

టాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా బ్లాక్‌బస్టర్ నిర్మాత, గ్రేట్ స్పీకర్ బండ్ల గణేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

బండ్ల గణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వీరి కాంబో కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కి దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ పలు చిత్రాలకు నిర్మాణం వహించే ప్లాన్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :