ఆ హీరోతో కళ్యాణ్ కృష్ణ కొత్త సినిమా?

నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయన నాగ చైతన్య తో ’రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ త్వరలో మరో సినిమాకు రంగం సిద్దం చేసాడు. వివరాల్లోకి వెళ్ళితే…

డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాస్ మహారాజ్ రవితేజకి ఒక కథ వినిపించినట్టు ఇండ‌స్ట్రీ టాక్. రవితేజ కి కూడా ఈ కథ నచ్చ‌డంతో పచ్చ జండా ఊపినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా బుధ‌వారం రిలీజ్ అయిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్ర‌స్తుతం విక్రమ్‌ సిరికొండ మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’ లో హీరోగా నటిస్తున్నాడు. సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.