‘బాలీవుడ్ స్టార్’ కాదట.. సూపర్ స్టార్ అట ?

Published on May 7, 2019 3:54 pm IST

దర్శకుడు క్రిష్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో తన తరువాత సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు.. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. క్రిష్ తన తరువాత చిత్రాన్ని తెలుగులోనే చేస్తారట. మహేశ్ బాబు కోసం ఓ కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 లో క్రిష్ – మహేశ్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలవ్వబోతూ ఆగిపోయింది. మరిప్పుడైనా ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరిన ఈ ఏడాది వరకు క్రిష్ మహేశ్ కోసం ఎదురుచూడాల్సిందే.

ఇక బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వని ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్.. అలాగే పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం క్రిష్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈ సారి తన సినిమాలో కేవలం తన ముద్ర మాత్రమే స్పష్టంగా కనపడేలా, క్రిష్ స్క్రిప్ట్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More