కొత్త పాయింట్ తో.. ‘ప్రతిరోజూ పండగే’ !

Published on Nov 20, 2019 12:00 am IST

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా… మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా… గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమా కథ గురించి తాజాగా మారుతి మాట్లాడుతూ.. “ఏదన్నా మంచి సినిమా చేయాలనే దాంట్లో రకరకాల కథలు అనుకొని ఫ్యామిలీ సబ్జెక్ట్ గా ప్రతీరోజు పండగేను తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ పెట్టగానే. రకరకాలుగా కథను ఊహించుకుంటున్నారు. తాత మనవడు కథ అనుకుంటున్నారు. ఇద్దరినీ కలిపే కథ అనీ, ఫ్యామిలీని కలిపే కథ అని అనుకుంటున్నారు.

కానీ అలాంటి కథ కాదు ఇది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి పాయింట్ ఇంతవరకు రాలేదు. పుట్టినప్పుడు సెలెబ్రేషన్ చేస్తాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా సంతోషంతో బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనేది ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాం. కొడుకు ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోతున్నాడు. తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఎంటర్ టైన్ చేస్తూ హార్డ్ టచింగ్ గా చెప్పాం. సత్య రాజ్ గారు చేసిన యాక్టింగ్ కి మాకే కళ్లలో నీళ్లొచ్చాయి అంటూ మారుతి తెలిపారు.

కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More