నాగ చైతన్య రాక కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు !

అక్కినేని నాగ చైతన్య చేస్తున్న సినిమాల్లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడ ఒకటి. చాలా రోజుల క్రితమే హైదరాబాద్లో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కానీ రెండో షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలుకాలేదు.

ఈ ఆలస్యానికి కారణం చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్న ‘సవ్యసాచి’ పనుల్లో బిజీగా ఉండటమేనని, నేను కూడ ఆయన కోసమే ఎదురుచూస్తున్నానని మారుతి అన్నారు. అలాగే ఫస్ట్ లుక్ ను మే నెలలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని కూడ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.