సౌత్ చిత్రాలపై మరాఠీ దర్శకుడి ప్రశంలు.

Published on Aug 2, 2019 12:04 am IST

యంగ్ హీరో ధృవ కరుణాకర్ హీరోగా తెరకెక్కుతున్న “అశ్వమేధం” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నితిన్.జి సౌత్ సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. దేశం మొత్తం సౌత్ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఉత్తమమైన చిత్రాల కొరకు ఎదురు చూస్తున్నారు అన్నారు. రాజమౌళి లాంటి దర్శకులు తమ చిత్రాలతో సౌత్ పరిశ్రమ పట్ల బాలీవుడ్ లో ఉన్న దురాభిప్రాయాని మార్చివేశారు అన్నారు.

ఎన్టీఆర్,రామ్ చరణ్, రవి తేజా వంటి హీరోల సినిమాలు హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయంటూ కితాబిచ్చారు. మరాఠి దర్శకుడైన నితిన్ జి గతంలో “వాట్ అబౌట్ సావర్కర్” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగులో ఆయన తెరకెక్కించిన “అశ్వమేధం” చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ అమితంగా ఆకట్టుకోవడటంతో చిత్రం పై అంచనాలు బాగున్నాయి.

సంబంధిత సమాచారం :