రవితేజ గాయపడిన వార్తలపై స్పందించిన దర్శకుడు !
Published on Feb 27, 2018 11:57 am IST

గత కొన్ని రోజులుగా హీరో రవితేజ షూటింగ్లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ‘నేల టికెట్’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదమే ఇందుకు కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కొద్దిసాపేతి క్రితమే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. బయట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, షూటింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, రవితేజ చాలా బాగున్నారని ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి కాంత్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా పోసాని, పృథ్వి వంటి నటులు నటిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

 
Like us on Facebook