కరోనా వైరస్ పై యంగ్ డైరెక్టర్ మూవీ

Published on Mar 29, 2020 12:00 am IST

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కరోనా వైరస్ పై సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. ప్రశాంత్ వర్మ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై మరియు ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చర్చించనున్నాడట. ఇక వైరస్ వ్యాప్తి అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే అనేక హాలీవుడ్ మరియు డొమెస్టిక్ మూవీస్ వచ్చినప్పటికీ ప్రశాంత్ కొత్తగా ట్రై చేస్తాడట.

ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రంగా ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరక్కించాడు. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. అలాగే గత ఏడాది రాజశేఖర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :

X
More