మహేష్ “సర్కారు వారి పాట” పై డైరెక్టర్ రాధా కృష్ణ కామెంట్స్!

Published on May 12, 2022 11:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో నేడు విడుదల అయ్యింది. ఈ చిత్రం పై సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదిక గా రెస్పాన్స్ ను తెలియజేస్తూ, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు టాలీవుడ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు. మహేష్ సర్ స్వాగ్, స్టైల్, మాస్ యాక్టింగ్ సర్కారు వారి పాట చిత్రం కి అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చారు. మ్యూజిక్ థమన్ అన్న మాస్ బీట్స్ తో ఆకట్టుకున్నాడు అని అన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో వెన్నెల కిషోర్, నదియా, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :