రాధే శ్యామ్ దర్శకుడి ఇంస్టాగ్రామ్ బ్లాక్.

Published on Jul 11, 2020 9:08 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.ఈ మూవీ టైటిల్ సోషల్ మీడియాలో అనేక రికార్డ్స్ నమోదు చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు . ఇక పోస్టర్ వైరల్ అవుతున్న క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణ కి ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ని బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్‌ఫాం చేస్తూ.. నేను వేరే వ్యక్తిలా నటిస్తున్నానంటా, ఆ వ్యక్తి ఎవరో మరి అంటూ ట్వీట్‌లో తెలిపాడు.

దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. దర్శకుడు పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా..నాలుగు భాషల్లో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :

More