ఈ సారి సెంటిమెంట్ తో రానున్న ‘బాలయ్య’ !

Published on May 22, 2019 2:37 pm IST

తమిళ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే మొదట రవికుమార్, బాలయ్యను దృష్టిలో పెట్టుకుని పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేశారట. ఆ స్క్రిప్ట్ విన్న బాలయ్య యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సినిమాలో హైలెట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చెయ్యమని కోరారని సమాచారం.

బాలయ్య సూచన మేరకు తన రైటర్స్ టీమ్ తో రవికుమార్, బాలయ్య పాత్రను చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మొత్తం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సెంటిమెంటల్ గా సాగుతుందట.

ఇక ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు పవర్ ఫుల్ విల‌న్‌ పాత్రలో న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More