ప్రేక్షకుల స్పందన చూసి గూస్ బమ్స్ వచ్చాయి-డియర్ కామ్రేడ్ డైరెక్టర్

Published on Jul 27, 2019 11:04 pm IST

విజయ్ దేవరకొండ,రష్మిక మందాన జంటగా నిన్న విడుదలైన డియర్ కామ్రేడ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ,హీరోయిన్ రష్మిక తో పాటు దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ పాల్గొన్నారు. చిత్ర యూనిట్ మూవీ విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ,ఈ మూవీ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నామో దానిని వంద శాతం చెప్పడం జరిగింది. సంధ్య థియేటర్లో క్లైమాక్స్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి మాకు గూస్ బంప్స్ లేచాయి అన్నారు. అలాగే రెండు మూడు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నారు. అలాగే ఈ మూవీలో లిల్లీగా రష్మిక హాస్య సన్నివేశాలతో పాటు,భావోద్వేగ సన్నివేశాలలో చాలా బాగా నటించింది అన్నారు.

సంబంధిత సమాచారం :