అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఎట్టకేలకు మూవీ ప్రకటించేశాడు

Published on Oct 10, 2019 10:12 am IST

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎట్టకేలకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశాడు. బాలీవుడ్ లోనే మరో చిత్రం చేస్తున్నట్లుగా అధికారికంగా స్పష్టం చేశారు. వివరాలలోకి వెళితే సందీప్ రెడ్డి వంగా తో కబీర్ సింగ్ చిత్రం నిర్మించిన నిర్మాతలే మరో మారు ఆయనతో చిత్రం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు నిర్మాతలు భూషణ్ కుమార్, మురద్ కేతాని ముంబైలో దర్శకుడు సందీప్ రెడ్డిని కలవడం జరిగింది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

గతంలో రణ్వీర్ కపూర్ హీరోగా ఓ క్రైమ్ డ్రామాని సందీప్ రెడ్డి వంగా నిర్మించనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంలో ఆయన నటించే అవకాశం కలదు. ఇక షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ఇటీవల విడుదలైన అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాదాపు 300కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం షాహిద్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సందీప్ రెడ్డి నిర్మాతలు చేసిన ఈ ప్రకటనతో తెలుగులో స్టార్ హీరోతో ఆయన సినిమా చేయనున్నాడనే ప్రచారానికి తెరపడింది.

సంబంధిత సమాచారం :

X
More