సుశాంత్ కేసులో టాప్ డైరెక్టర్ ని విచారించనున్న పోలీసులు.

Published on Jul 4, 2020 10:11 am IST

సుశాంత్ మరణించి మూడు వారాలు దాటిపోయినా కేసు విచారణ సాగుతూనే ఉంది. ఆయన ఆత్మ హత్య చేసుకొని మరణించాడని నిర్ధారణ అయినప్పటికీ…మానసిక వేదనకు కారణమైన వారి గురించి విచారణ జరుగుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె పలుమార్లు విచారణకు హాజరై కీలక సమాచారం అందించారు.

కాగా ఈ కేసులో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కూడా విచారించనున్నారట. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను కూడా విచారణకు హాజరు కావలసినదిగా పోలీసులు ఆదేశించారు. సుశాంత్ కి అనేక మార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందుకే ఆయన పలుమార్లు తన సిమ్ మార్చివేశాడని తెలుస్తుంది. విచారణ జరిగే కొద్దీ, సుశాంత్ కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More