ఆ ట్రెండ్ సెట్ చేసింది ఆ డైరెక్టరే…!

Published on Aug 1, 2019 12:23 pm IST

ఇండియా గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. ఆయన చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం మొదలుపెట్టి 26 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. దర్శకుడిగా ఆయన తెరక్కెక్కించిన “జెంటిల్ మెన్” చిత్రం 1993 జులై 30న విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఇన్నేళ్ల కాలంలో శంకర్ దర్శకత్వం వహించింది కేవలం 14 సినిమాలు మాత్రమే. కానీ ప్రతి సినిమా ఓఅద్భుతం, దేనికదే ప్రత్యేకం.

సోషల్ మెసేజ్ ప్రధానంగా సాగే కథకి కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు చేయడం అనే ట్రెండ్ ని దర్శకుడు శంకర్ పరిచయం చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోస్ సోషల్ మెస్సేజ్ చిత్రాలలో నటించేవారు కాదు. దానికి కారణం వారి స్టార్ డమ్, ఇమేజ్ అలాంటి చిత్రాలకు సరిపడదనే భావన కలిగి ఉండేవారు. దానికి భిన్నంగా స్టార్ హీరోలతో సోషల్ మెస్సేజ్ చిత్రాలు తీసి శంకర్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. జెంటిల్ మెన్,భారతీయడు,ఒకేఒక్కడు, అపరిచితుడు,రోబో,స్నేహితుడు దాదాపు ఆయన చేసిన అన్ని చిత్రాలు ఎంతో కొంత సామాజిక స్పృహ కలిగినవే కావడం విశేషం.

ఆయన తీసిన పద్నాలుగు చిత్రాలలో దాదాపు అన్ని బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ సాధించినవే. విక్రమ్ హీరోగా చేసిన ప్రయోగాత్మక చిత్రం “ఐ”,విజయ్ హీరోగా వచ్చిన “స్నేహితుడు” చిత్రాలు మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా “భారతీయుడు 2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :