పవన్, మహేశ్‌ల మధ్య ఆ దర్శకుడు ఏం తేడా గమనించాడంటే?

Published on Nov 26, 2021 2:00 am IST


కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో ఒకప్పటి దర్శకుడు ఎస్.జె సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఎస్.జె సూర్య టాలీవుడ్ టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేశ్‌ బాబుల గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తెలుగులో ఎస్.జె సూర్య పవన్ కళ్యాణ్ కాంబోలో ‘ఖుషీ’, ‘కొమరం పులి’ చిత్రాలు రాగా, మహేష్ బాబుతో ‘నాని’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అని, దేవుడు స్వయంగా కూర్చొని తయారుచేసిన సింగిల్ పీస్ పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలని అన్నారు. మహేష్గు బాబు రించి మాట్లాడుతూ మహేష్ తన మనసుకు నచ్చిన పని చేయడానికి కొంత ఆలోచిస్తాడని, పవన్ కళ్యాణ్‌కు, మహేశ్‌కు ఉన్న తేడా అదే అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :