వరుణ్ తేజ్ తో కూడా సినిమా లేనట్లే ?

Published on Oct 24, 2019 1:08 am IST

శ్రీకాంత్ అడ్డాల తన తరువాత సినిమాని పట్టాలెక్కించడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కోసం ఒక కథ రాశాడని త్వరలోనే ఈ సినిమా ఉండొచ్చు అని, పైగా ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని రీసెంట్ గా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో నిజం లేదట. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ఓ మలయాళ సినిమాని కూడా రీమేక్ చేయాలని చూస్తున్నాడట. వరుణ్ ప్లానింగ్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల సినిమా అనేది ఇప్పట్లో ఉండేలా కనిపించట్లేదు.

ఏమైనా ఇండస్ట్రీలో హిట్ ఉన్నవాళ్ళకే డిమాండ్. అదే ఒక సినిమా పరాజయం పాలైతే, ఇక ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, తొందరగా అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి ఫ్యామిలీ చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి మాత్రం మరో సినిమా మొదలుపెట్టడానికి మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇంకా శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్ కాలేదు.

సంబంధిత సమాచారం :

X
More