సొంతూరి కోసం స్టార్ డైరెక్టర్ సాయం

Published on Mar 29, 2020 10:00 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరికోసం ఆర్థిక సాయం ప్రకటించారు. తాను పుట్టి పెరిగిన తూర్పు గోదావరి జిల్లాలోని మట్టపర్రు గ్రామానికి 5లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కర్ఫ్యూ కొనసాగుతున్న తరుణంలో పేద రైతు కూలీలు, డైలీ లేబర్స్ ఉపాధి కోల్పోవడం వలన నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి కొనసాగుతుంది.కనుక అలాంటి పేదల సహాయార్ధం సుకుమార్ తన సొంత గ్రామానికి 5లక్షల సాయం ప్రకటించడంతో పాటు, మిగతా వారు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు.

ప్రస్తుతం సుకుమార్ హీరో అల్లు అర్జున్ తో ఓ మూవీ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More