ఇంటర్వ్యూ: వి.ఐ ఆనంద్ – కాన్సెప్ట్, కమర్షియల్ తో ‘డిస్కో రాజా’ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తాడు !

Published on Jan 22, 2020 1:39 pm IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు వి.ఐ ఆనంద్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చారు.

 

‘డిస్కో రాజా’ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రానుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లోనే సినిమా ఎందుకు చేయాలనిపిచింది ?

సైన్స్ ఫిక్షన్ అంటే నాకు చిన్నప్పటి నుండి బాగా ఇంట్రస్ట్. ఒకవిధంగా సైన్స్ ఫిక్షన్ నా ఫేవరేట్ జోనర్ కూడా. ఇక ఈ డిస్కో రాజా కాన్సెప్ట్ పది సంవత్సరాల క్రితమే నా మైండ్ లోకి వచ్చిన కాన్సెప్ట్. ఎప్పటి నుండో ఈ సినిమా కథకు సంబంధించి ఫుల్ డైటిల్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అల ఈ జోనర్లో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను.

 

టెన్ ఇయర్స్ బ్యాకే ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నారు, మరెందుకు ఇన్ని ఇయర్స్ ఈ సినిమా చేయలేదు ?

ఈ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ను డిటైల్డ్ గా ఎలివేట్ చేసే ఎలిమెంట్స్ నాకు క్లారిటీగా దొరకలేదు. అయితే లాస్ట్ ఇయర్ బయో కెమికల్ ల్యాబ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ ల్యాబ్ రీసెర్చ్ సక్సెస్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో స్క్రిప్ట్ రాసుకున్నాము. స్క్రిప్ట్ చాల బాగా వచ్చింది. ఓవరాల్ గా ‘డిస్కో రాజా’ ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా. సినిమాలో మంచి హ్యూమర్ తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ చాల సహజంగా ఉంటాయి.

 

ఈ సినిమా మీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

నేను చేసిన సినిమాలన్నిటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ తో తీసిన సినిమా. నాకు తెలుసు, నా కెరీర్ ను నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్లే సినిమా. స్క్రిప్ట్ దగ్గరినుంచీ సినిమాలో ప్రతి సీక్వెన్స్ ను ప్రతి షాట్ వరకూ ఎంతో కేర్ ఫుల్ గా పని చేశాము. సినిమాలో ప్రతి ఎమోషన్ చాల నేచురల్ గా ఉంటుంది. ఈ అందరికీ నచ్చుతుంది.

 

రవితేజకి ఈ జోనర్ కొత్త. ఆయన్ను ఎలా ఒప్పించారు ?

రవితేజగారు ఆయన కెరీర్ లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్న టైంలో నేను ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. మెయిన్ గా సినిమాలో డిస్కోరాజా క్యారెక్టర్ ఆయనకు చాల బాగా నచ్చింది. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఒక్క రవితేజగారినే దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. ఆయనతో పని చేయడం చాల హ్యాపీగా అనిపించింది.

 

ఈ కాన్సెప్ట్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ?

కాన్సెప్ట్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ సింక్ అవ్వవు అని ఒక ముద్ర బాగా పడిపోయింది, ఇది చాల రాంగ్ అండి. చాల హాలీవుడ్ సినిమాలు చూసుకున్న కాన్సెప్ట్ లో కూడా మంచి కమర్షియల్ ఉంటుంది. ఆ సినిమాలన్ని పెద్ద హిట్ అయ్యాయి. ఇక నా విషయానికి వస్తే.. కాన్సెప్ట్ ను కమర్షియల్ ను బ్యాలెన్స్ చేసుకుని డిస్కో రాజాతో కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేశాను.

 

రవితేజ సినిమాలో సహజంగా కామెడీ అండ్ మాస్ బిట్స్ లాంటివి ఆశిస్తారు ? అవి ఎంతవరకూ ఉంటాయి ?

రవితేజగారి నుండి ఆయన అభిమానులు అలాగే ప్రేక్షుకులు ఏమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా కామెడీతో పాటు రవితేజగారి వన్ లైన్ పంచ్, మాస్ ఎలివేషన్స్ ఇవ్వన్నీ స్టోరీలో ఉన్నాయి. పైగా ప్రేజింటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫీస్ట్ లా ఉంటుంది.

సంబంధిత సమాచారం :