మాస్ రాజా కోసం డైరెక్టర్లు పోటీపడుతున్నారు !

Published on May 5, 2019 10:00 pm IST

వరస పరాజయాలతో మాస్ రాజా రవితేజ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలని సినిమాల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి. ఐ ఆనంద్ చెప్పిన కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. డిస్కోరాజా అనే టైటిల్ తో కూడిన లోగో ను విడుదలచేసి సినిమా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు బడ్జెట్ సమస్యల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదే అదునుగా భావించిన కొందరు యంగ్ డైరెక్టర్లు రవితేజ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సంపత్ నంది , గోపిచంద్ మలినేని , అజయ్ భూపతి లాంటి డైరెక్టర్లు తమ కథలతో మాస్ రాజా ను ఒప్పించి సినిమా చేసే ప్రయత్నాల్లో వున్నారు. మరి వీరిలో రవితేజ ఎవరకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More