రవితేజ ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన దర్శకులు

రవితేజ ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన దర్శకులు

Published on Feb 16, 2020 9:18 AM IST

రవితేజ.. మాస్ ప్రేక్షక ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి, వినాయక్, శ్రీను వైట్ల, పూరి లాంటి స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేసిన ఈయన నవతరం దర్శకులతో కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కొత్తదనాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కొత్తవారికి అవకాశాలిస్తూ వస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇలా కొత్త డైరెక్టర్లతో వరుసగా వర్క్ చేసిన సీనియర్ హీరోల్లో మాస్ మహరాజ ఒకడుగు ముందే ఉన్నారు.

కానీ ఆయన్నుండి అవకాశాలను అందుకుంటున్న దర్శకులే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో రవితేజ చిత్రాలను చూస్తే ఈ సంగతి స్పష్టమవుతుంది. 2017లో అనిల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేసి హిట్ అందుకున్న ఆయన అప్పటి నుండి నూతన దర్శకులపై నమ్మకముంచారు. 2018లో విక్రమ్ సిరికొండతో ‘టచ్ చేసి చూడు’, కళ్యాణ్ కృష్ణతో ‘నేల టిక్కెట్’, సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్లతో ‘అమర్ అక్బర్ ఆంటొని’, ఈ యేడాదిలో విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రాలు చేశారు. ఇవన్నీ వరుసగా పరాజయం పొందాయి.

ఈ సినిమాల స్టోరీ లైన్స్ చూస్తే మల్టిపుల్ డిసార్డర్, చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతకడం వంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని నమ్మే రవితేజ ఆయా దర్శకులకు ఛాన్సులు ఇచ్చారు. కానీ వారు మాత్రం స్టోరీ లైన్ రాసుకోవడంలో ప్రతిభ చూపారు తప్ప వాటిని స్క్రీన్ మీద ప్రేక్షకులకు నచ్చేలా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఫలితంగా రవితేజ లాంటి కమర్షియల్ హీరో ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పరజాయాల్ని చవిచూశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు