డిస్కోరాజా షూటింగ్ అప్డేట్ !

Published on Apr 24, 2019 10:06 pm IST

మాస్ రాజా రవితేజ – వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ కంప్లీట్ కాగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు రవితేజ. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ మే మూడో వారం నుండి జరుగనుందని సమాచారం. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More