యాక్షన్ మోడ్‌లోకి మాస్ మహారాజ !

Published on May 26, 2019 7:16 pm IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ముగియగా రెండవ షెడ్యూల్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. మే 28వ తేదీ నుండి హైదరాబాదలో ఇది మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్.

జూన్ మూడవ వారం వరకు షూటింగ్ హైదరాబాద్లోనే జరగనుంది. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More