‘కాలా’ సినిమా వాయిదాపై క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు !


ఉదయం నుండి తమిళ సినీ పరిశ్రమలో ఏప్రిల్ 27న విడుదలకావల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క ‘కాలా’ చిత్రం వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. నిరసన వలన నిలిచిపోయిన సినిమాల్ని ముందుగా రిలీజ్ చేయాల్సి ఉండటమే ఈ వాయిదాకు కారణమని కూడ అన్నారు.

కానీ ఈ వార్తలపై స్పందించిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, వాయిదా వేస్తున్నట్టు తాము ఎవరికీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో గందరగోళంలో పడిన అభిమానులకు కాస్త రిలీజ్ దొరికింది. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించారు.