10 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న బన్నీ ‘డీజే’ !
Published on Nov 21, 2017 5:06 pm IST

‘బాహుబలి’ సిరీస్ తర్వాత బాలీవుడ్లో తెలుగు సినిమాలకున్న స్థాయి చాలా వరకు మారింది. రాజమౌళి విజన్ ను, టేకింగ్ ను గమనించిన హిందీ ప్రేక్షకులు తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలని యూట్యూబ్ లో వెతుక్కుని మరీ విపరీతంగా చూసేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఈ తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఆ హీరోల్లో కూడా అల్లు అర్జున్ సినిమాలకి క్రేజ్ ఇంకాస్త ఎక్కువగా కనబడుస్తోంది.

ఇప్పటికే ఆయన నటించిన ‘సరైనోడు’ హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా తాజాగా విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ ఒక్క రోజులోనే 10 మిలియన్ల వ్యూస్ ను అవలీలగా క్రాస్ చేసేసింది. దీంతో ఈ చిత్రాన్ని విడుదలచేసిన యూట్యూబ్ ఛానెల్ గోల్డ్ మైన్ ఫిలిమ్స్ కు మంచి లాభాలు దక్కనున్నాయి. హారీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

 
Like us on Facebook