వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేసిన ‘దువ్వాడ’ టీమ్ !


అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెట్ చేస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేయడానికి టీమ్ శరవేగంగా కదులుతోంది. అందుకే ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ రోజు నుండి వరుసగా రెండు రోజులు ఒక షెడ్యూల్ జరగనుంది.

అనంతరం బెంగుళూరులో మరో షెడ్యూల్ వెంటనే మొదలుకానుంది. ఈ రెండు షెడ్యూల్స్ లో బన్నీ, పూజా హెగ్డేల పై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే హరీష్ శంకర్ తనకు బాగా కలిసి వచ్చిన మహా శివరాత్రి రోజున ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత టీజర్ విడుదలను కూడా త్వరలోనే కానిస్తారని సమాచారం. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.