‘దోచేయ్’.. ఒక్కోరోజు ఒక్కోపాట..!

‘దోచేయ్’.. ఒక్కోరోజు ఒక్కోపాట..!

Published on Mar 26, 2015 4:33 PM IST

Dochey
‘స్వామిరారా’.. 2013లో విడుదలైన ఈ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ టేకింగ్ సినీ పరిశ్రమను అబ్బురపరచింది. అంతటి విజయం తర్వాత సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో ఓ క్రైమ్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్నీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు. ఎప్పుడూ ఒకే విధంగా చేస్తే బోర్ కొడుతుందనేమో, ఈ సినిమా పాటల ఆవిష్కరణను చాలా కొత్తగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

మార్చి 28 నుంచి సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో రోజు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో సుశాంత్ హీరోగా నటించిన కరెంట్ సినిమా ఆడియోను కూడా ఇదే విధంగా విడుదల చేశారు. ఇప్పుడు ‘దోచేయ్’కి కూడా అలానే చేయనున్నారని తెలుస్తోంది. బి.వి.ఎస్.ఎన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు