మెగాస్టార్ అమితాబ్ ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..?

Published on Oct 19, 2019 12:00 pm IST

గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమితాబ్ బచ్చన్ మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్‌కు చికిత్స అందిస్తున్నారు. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా అమితాబ్ ను హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన అభిమానులు,కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఐతే అమితాబ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.

అమితాబ్ తన కాలేయం డెబ్భై ఐదు శాతం దెబ్బతిన్నదని అమితాబ్ కొద్దిరోజుల క్రితం స్వయంగా తెలిపారు. ఇటీవలే 77వ పుట్టినరోజు వేడుక జరుపుకున్న అమితాబ్ సడన్ గా ఆస్పత్రిపాలు కావడం కొంచెం బాధకలిగిస్తుంది. మెగాస్టార్ చిరు నటించిన సైరా చిత్రంలో ఓ మంచి పాత్ర చేసిన అమితాబ్, హిందీలో ప్రస్తుతం ‘గులాబో సితాబో’ మరియు బ్రహ్మాస్త్ర అనే భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More