బాలయ్యకు ఆ రోల్ సూట్ అవుతుందా ?

Published on Feb 17, 2020 12:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ హల్ చల్ చేస్తోంది. సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కనిపించబోతున్నాడని ఆ న్యూస్ సారాంశం. ఆలాగే ఆధ్యాత్మికతతో మొదలై బాలయ్య పాత్ర కూడా చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట, పైగా బాలయ్య అసలు అఘోరాగా ఎలా మారాడు ఆయన గతం ఏమిటి అనే కోణంలో కూడా ఓ పవర్ ఫుల్ ప్లాష్ బ్యాక్ కూడా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో అసలు నిజం ఉందా అనేది అనుమానమే. బాలయ్య లాంటి మాస్ హీరోకి అఘోరా లాంటి పాత్ర ఎంతవరకు సూట్ అవుతుంది. ఒకవేళ బాలయ్య అలాంటి రోల్ లో నటిస్తే ఆయన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక బాలకృష్ణ అయితే సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ ఈ నెల 26న నుండి జరగబోతుంది. నిజానికి గత నెలలోనే మొదలవ్వాల్సిన షూటింగ్ బోయపాటి ఇంట్లో జరిగిన విషాదం కారణంగా అనుకున్న డేట్ కి షూటింగ్ ప్రారంభించలేదు. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :