నాగశౌర్య ‘శైలజారెడ్డి అల్లుడు’ తో పోటీపడనున్నాడా ?
Published on Jul 21, 2018 9:00 pm IST

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్ర షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఇంకా ఒక్క సాంగ్ ను మాత్రమే బ్యాలెన్స్ ఉంది . రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈచిత్రాన్ని ఆగష్టు 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈచిత్రం తో బాక్సాఫిస్ వద్ద పోటీపడడానికి రెడీ అవుతున్నాడట నాగశౌర్య. ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం తరువాత ఆయన నటిస్తున్నచిత్రం ‘@నర్తనశాల’. ఐర క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయనున్నారని సమాచారం. ఒక వేళా ఈ వార్తలు నిజమైతే ఇద్దరు యువ హీరోల మధ్య ఆసక్తిక పోరు నెలకొనడం ఖాయం

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook