బాలీవుడ్ ప్రముఖ సింగర్‌పై గృహహింస కేసు..!

Published on Aug 4, 2021 12:00 am IST

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ యోయో హనీ సింగ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాటలతో, వీడియోలతో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండే హనీ సింగ్‌కు తాజాగా అతడి భార్య షాక్ ఇచ్చింది. హనీ సింగ్‌పై గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ భార్య శాలిని కేసు పెట్టింది. ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తానియా సింగ్ ముందు ఈ కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఆగస్టు 28 లోపు వివరణ ఇవ్వాలంటూ హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇదే కాకుండా హనీ సింగ్‌, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల విషయంలో షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే దాదాపు 7 ఏళ్ల కిర్తం ‘ఇండియాస్ రాక్ స్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను పరిచయం చేశాడు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో హనీ సింగ్ కెరిర్ సాఫీగా సాగింది. మరీ ఇప్పుడు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన కెరీర్‌లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :