డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ‘దొంగాట’

డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ‘దొంగాట’

Published on May 17, 2015 3:00 PM IST

dongaata

తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనమున్న కథలని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. గతంలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్టులో తాజాగా ‘దొంగాట’ సినిమా కూడా చేరింది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నటించి, నిర్మించిన సినిమాయే ‘దొంగాట’లో అడవి శేష్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.

రెండు వారల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా రెండో వారంలో కూడా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రెండవ వారంలో కూడా దొంగాట సినిమాకి అన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ‘దొంగాట’ సినిమా విషయంలో సెకండాఫ్‌లోని కామెడీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ఒక స్టార్ హీరోయిన్‌ పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నవదీప్, సుశాంత్, రానా, నాని, రవితేజ, శింబు, నాగార్జున, మంచు మనోజ్ ఇలా ఇంతమంది హీరోలతో కలిసి చేసిన పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దొంగాట విజయంతో హ్యాపీగా ఉన్న మంచు లక్ష్మి తన తరువాతి ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.

తాజా వార్తలు