ఓటిటి లో అందుబాటులోకి వచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’

Published on Oct 8, 2022 1:24 am IST

యువ నటుడు శ్రీ సింహా కోడూరి ప్రస్తుతం ఒక్కో సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ దొంగలున్నారు జాగ్రత్త. ప్రీతీ అస్రాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని కీలక రోల్ చేయగా ఈ మూవీని సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా మూవీగా తెరకెక్కించారు దర్శకుడు సతీష్ త్రిపుర.

ఒక కారులో దొంగతనం చేయడానికి వచ్చిన ఒక దొంగ అనుకోకుండా అందులోనే ఇరుక్కుపోవడం, ఆపైన కొన్ని అనూహ్య పరిణామాల కథాంశంతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ అయి ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు నేటి నుండి తమ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :