ఆసక్తికలిగిస్తున్న “దొరసాని” ప్రీ లుక్ పోస్టర్

Published on May 25, 2019 6:03 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రం ద్వారా కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ గంగినేని నిర్మిస్తున్నారు.

యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. నవాబుల కాలంలో గొప్పింటి దొరసానికి, పేదవాడైన రాజు అనే ఒక యువకుని మధ్య నడిచే ప్రేమ కథ చిత్రం అని వినికిడి.నాటి తెలంగాణా లో ఉన్న సామజిక పరిస్థితులను అద్దంపట్టేదిగా ఈ మూవీ ఉంటుందని సమాచారం. అచ్చమైన తెలంగాణ భాషా సంస్కృతుల్ని ఈ చిత్రంలో మహేంద్ర చూపించనున్నారు.

ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More