“RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ టెలికాస్ట్ పై డబుల్ క్లారిటీ.!

“RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ టెలికాస్ట్ పై డబుల్ క్లారిటీ.!

Published on Dec 26, 2021 9:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ సినిమా ఇప్పుడు నార్త్ లో సాలిడ్ ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది. ఆల్రెడీ చాలా ఇంటర్వూస్ షోలలో ఈ సినిమా కీలక యూనిట్ అంతా కూడా పాల్గొన్నారు.

అయితే వీటి అన్నిటిలో కూడా నెక్స్ట్ లెవెల్లో హిందీ ఆడియెన్స్ అందరికీ బాగా రీచ్ అయ్యే విధంగా ఒక భారీ ఈవెంట్ ని వీరు ప్లాన్ చేసి షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లైవ్ అప్పుడు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది రికార్డెడ్ గా షూట్ చేసి తర్వాత టెలికాస్ట్ చేస్తామని తెలిపారు.

అయితే మరి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చేసింది. ఈ వచ్చే డిసెంబర్ 31న రాత్రి 11 గంటలకి ఈ ఈవెంట్ ని జీ హిందీ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేయనున్నారట. ఇంకో అంశం ఏమిటంటే అసలు ఈ ఈవెంట్ నే కొత్త సంవత్సరం ఈవెంట్ లా ప్లాన్ చేశారు.

అలాగే ఇంకో క్లారిటీ ఏమిటంటే ఈ ఈవెంట్ ని డిసెంబర్ 31తో పాటుగా తర్వాత జనవరి మొదటి ఆదివారం టెలికాస్ట్ టెలికాస్ట్ చేస్తారట. మరి ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అసలే సల్మాన్, కరణ్ జోహార్, ఎన్టీఆర్ చరణ్ ల పెర్ఫామెన్స్ ఇంకా అనేకం ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు