సంక్రాంతి కానుకగా నేడు థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ మరో చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ అయితే తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా సాలిడ్ గెస్ట్ రోల్ లో మాస్ మహాట్రాజ్ రవితేజ కూడా నటించగా మరో బిగ్గెస్ట్ ఎసెట్ కాగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం తన ఫాన్స్ కి డబుల్ “ధమాకా” దక్కేసినట్టే అని చెప్పాలి.
ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ కొన్ని వారాల కితమే రవితేజ నటించిన “ధమాకా” చిత్రంతో సెన్సేషనల్ కం బ్యాక్ ని అందుకోవడం, ఇప్పుడు వాల్తేరు వీరయ్య లో కూడా తన రోల్ ఎక్కడా డిజప్పాయింట్ చేయకుండా ఉండడంతో తన ఫ్యాన్స్ కి మాత్రం బ్యాక్ టు బ్యాక్ డబుల్ ధమాకా దక్కినట్టే అని చెప్పాలి. దీనితో ఈ క్రేజీ మూమెంట్ ని వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరయ్య సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


