నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం DSJ(దెయ్యంతో సహజీవనం). ఈ చిత్రం లో రాజీవ్ సాలూరు కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రానికి నట్టికుమార్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం ను తెలుగు తో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం టీజర్ ను నేడు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ టీజర్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నామని, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచామని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారని, అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించిందని అన్నారు.
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ నాన్న డైరెక్షన్ లో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. అంచనాలకు తగ్గట్టు చిత్రం చాలా బాగా వచ్చింది అని అన్నారు. నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ, నేటి ట్రెండ్ కు తగ్గట్టు విభిన్నంగా నిర్మించిన హారర్ చిత్రమిది అని. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్ గౌతంరాజు.


