‘డ్యూయెల్ సిటిజ‌న్ షిప్’ పై పూరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

‘డ్యూయెల్ సిటిజ‌న్ షిప్’ పై పూరి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on May 23, 2021 7:30 PM IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా ఈ రోజు ‘డ్యూయెల్ సిటిజన్ షిప్’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. ‘పాండమిక్ త‌ర్వాత చాలా దేశాలు ఈ 2021లో డ్యూయెల్ సిటిజ‌న్ షిప్‌ ను ఆఫ‌ర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ డ్యూయెల్ సిటిజ‌న్ షిప్ గాని మనం తీసుకుంటే, ఇక్క‌డైనా ఉండొచ్చు, అక్క‌డైనా ఉండొచ్చు. డొమెనికా..150 వేల డాల‌ర్స్ అంటే కేవ‌లం కోటి రూపాయ‌లు అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు, వాళ్లకు సిటిజ‌న్ షిప్ ఇస్తారు. ఈ డొమెనికా పాస్‌ పోర్ట్ ఉంటే దాదాపు 130 దేశాల‌కు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. మాల్టా.. యూరోప్‌లోని మ‌రో అంద‌మైన దేశం. ఇక్కడ నాలుగున్న‌ర కోట్లు ఇన్వెస్ట్ చేసినా.. వీళ్లు సిటిజ‌న్ షిప్ ఇవ్వ‌డానికి చాలా ఆలోచించి ఇస్తారు, ఒక్కోసారి నిరాక‌రించ‌వ‌చ్చు కూడా. ఇక వీళ్లిచ్చే పాస్‌పోర్ట్ వ‌ల్ల 155 దేశాల‌కు వెళ్లే అవకాశం ఉంది.

మాల్డోవా అనే దేశం.. ఈస్ట్ర‌న్ యూరోప్‌ లో ఉంటుంది. ఈ దేశం విష‌యానికి వ‌స్తే.. 90 ల‌క్ష‌లు బ్యాంక్ డిపాజిట్ లేక ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇక మీరు 122 కంట్రీస్‌కు వీసా లేకుండా హ్యాపీగా వెళ్లిపోవచ్చు. వ‌న‌టు.. ఆస్ట్రేలియా వెద‌ర్‌లోని దేశం. కోటిన్న‌ర రూపాయ‌లు ఆ గ‌వ‌ర్న్‌మెంట్‌ కు ఇచ్చేస్తే ఇక అన్నీ వాళ్లే చూసుకుంటారట. 116 దేశాల‌కు వీసా ఫ్రీ. 45 రోజుల్లోనే సిటిజ‌న్ షిప్ ఇచ్చేస్తారు. సెయింట్ లూసియా ద్వీపం, ప్ర‌తి వ్య‌క్తి 70 ల‌క్ష‌ల రూపాయలిస్తే నాలుగు నెల‌ల్లోనే సిటిజ‌న్ షిప్ ఇస్తారు. 146 దేశాల‌కు వెళ్లే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇలా డ్యూయెల్ సిటిజ‌న్ షిప్ ఇవ్వ‌డానికి చాలా దేశాలున్నాయి. కానీ ఇండియా ఇలాంటి డ్యూయెల్ సిటిజ‌న్ షిప్‌ కి ఒప్పుకోదు. అదే ట్విస్ట్‌’ అంటూ పూరి తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు