దుల్కర్, సోనమ్ ల రొమాంటిక్ పోజ్ అదిరిందిగా

Published on Jul 29, 2019 8:37 am IST

దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘ది జోయా ఫ్యాక్టర్’. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతుంది. అనుజా చౌహన్ రాసిన ది జోయా ఫ్యాక్టర్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా చేస్తుండగా, సోనమ్ యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సివుండగా వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తుంది.

కాగా ‘ది జోయా ఫ్యాక్టర్’ మూవీలోని దుల్కర్ సల్మాన్,సోనమ్ కపూర్ ల రొమాంటిక్ ఫోటో ఒకటి విడుదలైంది.దుల్కర్ సల్మాన్, సోనమ్ ని కౌగిలించుకున్న ఆ ఫొటోలో ఈ యంగ్ లవర్స్ చాలా ప్లెసెంట్ గా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ గతంలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కార్వాన్’ చిత్రంలో చేయడంలో జరిగింది. దుల్కర్ ‘ది జోయా ఫ్యాక్టర్’ మూవీతో బాలీవుడ్ లో సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం అమిత్ తివారి అందిస్తుండగా, సెప్టెంబర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :