స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కరోనా పాజిటివ్..!

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కరోనా పాజిటివ్..!

Published on Jan 20, 2022 10:17 PM IST

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జనవరి 15న ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిందని, ఐసోలేష‌న్‌లో ఉంటున్నాను. మైల్డ్ ఫ్లూ, స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అంతే తప్ప.. నాకు అంతా బావుంది. అయితే ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారందరు ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కరోనా పాండమిక్ ఇంకా అవ్వలేదు, దయచేసి అందరూ మాస్క్‌లు ధరించండి” అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తండ్రీ కొడుకులిద్దరూ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు