ఓటీటీ సమీక్ష : దుపాహియా – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష : దుపాహియా – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

Published on Mar 11, 2025 11:40 PM IST

Dupahiya

విడుదల తేదీ : మార్చి 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : స్పర్శ్ శ్రీవాత్సవ, గజ్‌రాజ్ రావు, శివాని రఘువంశీ, కోమల్ ఖుష్వాహ, యశ్పాల్ శర్మ, భువన్ అరోరా, రేణుక షహానె తదితరులు
దర్శకుడు : సోనమ్ నాయర్
నిర్మాత : బాంబే ఫిల్మ్ కార్టెల్
సంగీతం : సోమేశ్ సాహా
సినిమాటోగ్రఫీ : పీయూష్ పుటి

ఎడిటర్ : యశస్విని వై.పి.
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘దుపాహియా’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. స్పర్శ్ శ్రీవాత్సవ, గజ్‌రాజ్ రావు, శివాని రఘువంశీ, కోమల్ ఖుష్వాహ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

‘బెల్జియమ్ ఆఫ్ బీహార్’గా పిలువబడే ధడక్‌పూర్ గ్రామంలో ఈ సిరీస్ కథ సాగుతుంది. స్కూల్ టీజర్ బన్వరి ఝా(గజ్‌రాజ్ రావు) కూతురు రోషిని ఝా(శివాని రఘువంశీ)కి పల్లెటూరి జీవితం నచ్చదు. దీంతో ఆమె పట్టణానికి వెళ్లాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ముంబైలో ఉద్యోగం చేసే కుబేర్(అవినాష్ ద్వివేది)తో పెళ్లి సంబంధానికి రోషిని అంగీకరిస్తుంది. అయితే, కుబేర్ రూ.5 లక్షల విలువగల దుపాహియా(రెండు చక్రాల బండి)ని కట్నం కింద కోరుతాడు. దీంతో బన్వర్ ఝా కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఓ బండిని కొనిస్తారు. కానీ, అది అనుకోని విధంగా దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ వెబ్ సిరీస్ ప్రారంభంలోనే మేకర్స్ మనకు ఎలాంటి కథ చూపించబోతున్నారో అర్థం అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే వారి ప్రయత్నం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ విజయం సాధించారని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్‌లో చాలా వరకు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇటీవల వస్తున్న వెబ్ సిరీస్‌లలో రక్తపాతం, విధ్వంసం ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, దుపాహియా మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు.

ధడక్‌పూర్ గ్రామస్థులు తమ గ్రామంలో 25 ఏళ్లుగా ఎలాంటి క్రైమ్ జరగలేదని గర్వంగా చెప్పుకుంటారు. కానీ, దుపాహియా చోరీకి గురవడంతో కొంతమంది ఈ అవకాశాన్ని వాడుకుని గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సీక్వె్న్స్‌లు, ఊరిజనం అమాయకత్వం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ఈ వెబ్ సిరీస్‌లో మనుష్యుల మధ్య విభేదాలను కోమల్ ఖుష్వాహ పాత్ర ద్వారా స్పష్టంగా చూపెట్టారు. ఆమె పాత్రను చక్కగా రాసుకున్నారు. ‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ ఇన్‌స్టా రీల్స్ ఇష్టపడే కుర్రాడిగా కనిపిస్తాడు. ఆయన పాత్రలోని ఎమోషనల్ టచ్‌ను బాగా పలికించాడు. గజ్‌రాజ్ రావు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. యశ్పాల్ శర్మతో ఆయన సీన్స్ నవ్వులు తెప్పిస్తాయి. మిగతావారు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు.

మైనస్ పాయింట్స్ :

శివాని రఘువంశీ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఆమె స్క్రీన్ టైమ్ ఇంకాస్త ఎక్కువగా ఉండాల్సింది. ఈ సిరీస్ ఆమె చుట్టూ తిరుగుతుంది కాబట్టి, ప్రేక్షకులకు ఈ భావన కలుగుతుంది. ఈ సిరీస్ కథ చాలా సింపుల్‌గా ఉండటంతో 9 ఎపిసోడ్స్ చాలా లెంగ్తీగా అనిపిస్తాయి.

ఈ సిరీస్ గ్రామీణ నేపథ్యంలో సాగడంతో, గతంలో వచ్చిన ‘పంచాయత్’ వంటి వెబ్ సిరీస్‌లు గుర్తుకు వస్తాయి. దాదాపు అవి కూడా ఇలాంటి కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉండటమే దీనికి కారణం. ముఖ్యంగా దుపాహియా, పంచాయత్ వెబ్ సిరీస్‌లను పోలిస్తే, పంచాయత్‌లో మంచి పాయింట్ ఉన్నట్లుగా కొంతమేర అనిపిస్తుంది. రెండింటిలోనూ విభిన్న సమస్యలను లేవనెత్తారు. దుపాహియా లోని పాయింగ్ సామాజిక అంశాలను పాయింట్ చేసిన తీరు బాగున్నా దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారని అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

సోమేశ్ సాహా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. కానీ, ఇలాంటి వెబ్ సిరీస్‌కు ఓ టైటిల్ ట్రాక్ ఉండి ఉంటే బాగుండేది. పీయూష్ పుటి సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపెట్టారు. సోనమ్ నాయర్ దర్శకత్వం బాగుంది. సిరీస్‌లో చక్కటి కామెడీ ఉండే విధంగా.. నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టడంలో ఆమె సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.

తీర్పు :

మొత్తంగా చూస్తే, ‘దుపాహియా’ వెబ్ సిరీస్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ చక్కటి కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కొన్ని కామెడీ సీక్వెన్స్‌లను రాసుకున్న తీరు బాగుంది. గజ్‌రాజ్ రావు, స్పర్శ్ శ్రీవాత్సవ, యశ్పాల్ శర్మ, కోమల్ ఖుష్వాహ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. అయితే, ఫిమేల్ లీడ్ పాత్రలకు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం ఆకట్టుకోదు. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే ఈ సిరీస్ రన్‌టైమ్ ఇంత లెంగ్తీగా ఉండేది కాదు. ఓ డీసెంట్ వెబ్ సీరిస్‌గా ‘దుపాహియా’ను ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు